తెలంగాణ

telangana

'కంటోన్మెంట్ అభివృద్ధిని ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది'

కంటోన్మెంట్ అభివృద్ధిని ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని.. ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తెరాస కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ నిర్మాణ పనులను మర్రి రాజశేఖరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

By

Published : Jan 20, 2021, 9:23 PM IST

Published : Jan 20, 2021, 9:23 PM IST

sayanna on cantonment development in secunderabad
'కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రారంభోత్సవాలతో కంటోన్మెంట్ అభివృద్ధిని ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని పేర్కొన్నారు.

తిరుమలగిరిలోని ఇన్ఫాంట్రీ జీసస్ కాలనీలో (వీకర్ సెక్షన్)లో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ నిర్మాణ పనులను తెరాస మల్కాజ్​గిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేఖరరెడ్డితో కలిసి సాయన్న ప్రారంభించారు.

ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

తెరాస ప్రభుత్వం ఎన్నో వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెరాస ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని వెల్లడించారు. వరుస అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర రెడ్డి, బోర్డ్ సభ్యురాలు, శ్యామ్ కుమార్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీ. ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య..

ABOUT THE AUTHOR

...view details