తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాంసాహారం వద్దు-శాకాహారం ముద్దు' - మాంసాహారం

పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో మహా శాకాహార ర్యాలీ నిర్వహించారు. 'మాంసాహారం వద్దు-శాకాహారం ముద్దు'అంటూ నినాదాలు చేశారు.

'మాంసాహారం వద్దు-శాకాహారం ముద్దు'

By

Published : Aug 16, 2019, 8:24 AM IST

73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్​లోని పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మహా శాకాహార ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1000 మంది మహిళలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. 'మాంసాహారం వద్దు-శాకాహారం ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచారు. ప్రతి ఒక్కరూ 'శ్వాస పైన ధ్యాస పెట్టి ' ధ్యానం చేయాలని, అందువల్ల సర్వరోగాలు నివారించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

'మాంసాహారం వద్దు-శాకాహారం ముద్దు'

ABOUT THE AUTHOR

...view details