తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపట్నుంచి ఘనంగా సావిత్రి బాయి పూలే జయంత్యుత్సవాలు - హైదరాబాద్​ తాజా వార్తలు

సమసమాజ స్థాపన కోసం, మహిళా సాధికారత కోసం సావిత్రి బాయి పూలే తన జీవితాన్ని ధారపోశారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి సాగర్ తెలిపారు. జనవరి 2న హైదరాబాద్​లో సావిత్రి పూలే జయంతిని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

savitri-bhai-pooles-birthday-celebrations-in-January
జనవరి 2 నుంచి ఘనంగా సావిత్రిభాయి పూలే జన్మదిన వేడుకలు

By

Published : Dec 30, 2020, 1:30 PM IST

Updated : Jan 1, 2021, 4:21 AM IST

దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘసంస్కర్త సావిత్రి బాయి పూలే 189 జయంతి వేడుకలను హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణి మంజరిసాగర్​ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీసీ మహిళలు తరలిరావాలని ఆమె కోరారు.

సావిత్రి బాయి పూలే అసమాన సేవలను కీర్తిస్తూ జనవరి 2 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని మణి మంజరిసాగర్​ తెలిపారు. సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం సావిత్రి తన జీవితం ధారపోశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితర ముఖ్య నాయకులు హాజరు కానున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

రేపట్నుంచి ఘనంగా సావిత్రి బాయి పూలే జయంత్యుత్సవాలు

ఇదీ చదవండి:'ఈ లఘు చిత్రం మహిళల్లో ధైర్యాన్ని పెంపొందిస్తుంది'

Last Updated : Jan 1, 2021, 4:21 AM IST

ABOUT THE AUTHOR

...view details