భగవాన్ శ్రీసత్యసాయి బాబా 94వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు వారం రోజుల పాటు జరుగనున్న జన్మదిన వేడుకలను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రారంభించారు. సత్యసాయి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శివం రోడ్‌లో ప్రారంభమైన సత్యసాయి జన్మదినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి.
సత్యసాయి 94వ పుట్టిన రోజు వేడుకలు - భగవాన్ శ్రీసత్యసాయి బాబా 94వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా ఆరంభమయ్యాయి.
పుట్టపర్తి సాయిబాబా 94వ పుట్టిన రోజు వేడుకలు ఛీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ భాగ్యనగరంలో ప్రారంభించారు. ఈ వేడుకలు 18 నుంచి 23 వరకు వారం రోజుల పాటు జరగనున్నాయని నిర్వహకులు తెలిపారు.

సత్యసాయి 94వ పుట్టిన రోజు వేడుకలు
ఏపీలోని పుట్టపర్తితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపనున్నట్లు నిర్వహకులు తెలిపారు. వేడుకల్లో భాగంగా బాల వికాస్, మహిళా దినోత్సవాలను యువతకు ప్రత్యేకంగా కేటాయించామని నిర్వహకులు అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించే మహిళా దినోత్సవంకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
సత్యసాయి 94వ పుట్టిన రోజు వేడుకలు
ఇదీ చూడండి : మైనర్‌ను అపహరించిన మరో మైనర్..!