హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మల బస్తీ గంగపుత్ర సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. ఫలితాల్లో పూస సత్యనారాయణ బెస్త ప్యానెల్ విజయం సాధించింది. అభ్యర్థులను పూస ధనరాజ్ బెస్త బలపరచగా.. అధ్యక్ష బరిలో పూస సత్యనారాయణ బెస్త, మదునాల బాబురావు బెస్త, పాశం వెంకటేష్ బెస్త బరిలో నిలిచారు. సాయంత్రం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో పూస సత్యనారాయణ బెస్త సమీప ప్రత్యర్థి బాబురావుపై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
పోలైన మొత్తం ఓట్లు 322..
సంఘం పరిధిలో మొత్తం 322 ఓట్లు పోల్ అవ్వగా.. పూస సత్యనారాయణ 159 ఓట్లు పొందారు. 156 ఓట్లతో బాబురావు రెండో స్థానం దక్కించుకున్నారు. ఫలితంగా మూడు ఓట్ల తేడాతో బాబు రావు ఓటమి పాలయ్యారు. అనంతరం సంఘం కార్యాలయంలో సత్యనారాయణ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.