తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు - satya sai birthday celebrations

అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి 95వ జయంతి వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సత్యనారాయణ వ్రతం, సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.

sathya sai-jayanti-celebrations-in-puttaparthi-anantapur-district in ap
పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు

By

Published : Nov 18, 2020, 5:37 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయి కుల్వంత్​ మందిరంలో సత్యనారాయణ వ్రతం, సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేణుగోపాల స్వామి విగ్రహాన్ని రథంపై ప్రతిష్ఠించి, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రథోత్సవం ప్రారంభించారు. పెద్ద వెంకమ్మ రాజు కల్యాణ మండపం నుంచి గోపురం వరకు భక్తులు సాయి నామాన్ని కీర్తిస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు.

పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు

సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి వీధులన్నీ పులకించి పోయాయి. నేటి నుంచి 23 వరకు కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా జయంతి వేడుకలు జరుగుతాయని ట్రస్ట్​ సభ్యులు వెల్లడించారు. ఈ వేడుకలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు.

ఇదీ చదవండి:క్లినికల్​ ప్రయోగాల్లో చైనా టీకా సక్సెస్​

ABOUT THE AUTHOR

...view details