యురేనియం తవ్వకాలు నల్లమల సమస్య మాత్రమే కాదని యావత్ కృష్ణా నది పరివాహాక ప్రాంత సమస్య అని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ తెలిపారు. ఈ తవ్వకాలతో హైదరాబాద్ నగరానికి వచ్చే నీళ్లు కలుషితమవుతాయని, డిండి, నాగార్జున సాగర్ నీళ్లు విషపూరితంగా మారుతాయని చెప్పారు. రాష్ట్రంలో 10 శాతానికి పైగా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో ఎందుకు అవకాశం కల్పించలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇచ్చారని ఆక్షేపించారు.
"యురేనియం తవ్వకాలతో రాష్ట్రానికి వచ్చే లాభమేంటో సీఎం చెప్పాలి"
నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాల వలన మన రాష్ట్రానికి వచ్చే లాభమేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలన్నారు.
'ఇది కేవలం నల్లమల సమస్య కాదు'