తెలంగాణ

telangana

ETV Bharat / state

Saroornagar Lake Water Issue : సరూర్‌ నగర్‌ చెరువు గేట్లు ఎత్తారు.. ప్రజలు కష్టాల్లో పడ్డారు - తెలంగాణలో వర్షాలు వల్ల వస్తున్న సమస్యలు

Problems with Manholes in Hyderabad City : మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు వల్ల చెరువులు, నాలాలు నీటితో పొంగి పొర్లుతున్నాయి. దీని ఫలితంగా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు మురికి నీటి వల్ల వచ్చే సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అలానే సరూర్‌నగర్‌ చెరువు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు కాలనీల్లోకి ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

Saroornagar Lake Water Issue
Saroornagar Lake Water Issue

By

Published : Jul 21, 2023, 10:27 PM IST

సరూర్‌ నగర్‌ చెరువు గేట్లు ఎత్తివేయడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

Rains in Saroornagar: జంట నగరాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు, నాలాల్లో నీరు పొంగి ప్రవహిస్తోంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు ఒక వైపు అయితే.. ఇంటి ముందు వరద నీరు మరోవైపు ప్రజలని సమస్యలకి గురి చేస్తున్నాయి. సరూర్‌ నగర్‌ చెరువు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు కాలనీల్లోకి ప్రవహిస్తోంది. స్థానికులు ఇళ్ల నుంచి అడుగు బయటకు పెట్టాలంటే ఆందోళన చెందుతున్నారు. చెరువు గేట్లు ఎత్తుతున్నట్టు ముందుగా అప్రమత్తం చేయలేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నుంచి వస్తున్న నీటితో పాటు మురికి నీరు తోడు అవ్వడంతో మరింత ఇబ్బందికరంగా పరిస్థితి మారింది.

Problems in Saroornagar Because Drainage Water : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల నగరాన్ని కుదిపేస్తున్నాయి. చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా చెరువులు, నాలాల పరిసర ప్రాంతాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. సరూర్‌నగర్‌ చెరువులోని ఆరు గేట్లు ఎత్తివేయడంతో.. వరద నీరు ఒక్కసారిగా దిగువన ఉన్న కాలనీల్లోకి చేరింది. కోదండరాంనగర్‌, వివేకానందనగర్‌, శారదనగర్‌ ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. పూర్తిగా ఇళ్ల మధ్య నున్న మ్యాన్‌హోల్స్‌ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు కూడా వెళ్లలేకపోతున్నామని చెబుతన్నారు. మురికి నీళ్లు వస్తున్నందున.. భరించలేని దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.

Telangana Rains : బీ అలర్ట్‌.. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Water in Nalas and Ponds in Ramnagar: ఇటీవలే కోదండ రాం నగర్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్డు నిర్మించేందుకు తవ్వకాలు జరిపారు. ఇరవై రోజులు గడుస్తున్నా రోడ్డు గురించి పట్టించుకోకపోవడంతో.. వర్షాకాలంలో చెరువులు, నాలాలు పొంగినీరు ఇళ్ల ఎదుట నిలిచిపోతుందనిపలువురు స్థానిక మహిళలు విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు ఎటువంటి చొరవ చూపడం లేదని చెబుతున్నారు.

సరూర్‌నగర్‌ చెరువు గేట్లు ఎత్తివేస్తున్నట్టు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే.. గేట్లు ఏ విధంగా ఎత్తివేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే మూడు రోజులు భారీగా వర్షాలుపడే అవకాశం ఉందని.. దాని వల్ల మరింత నీరు ఇంటి ముందు చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆయా ప్రాంతాల్లోని నీటిని తోడేసే విధంగా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details