ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన మోదీ విజన్‌తో సరూర్‌నగర్ డివిజన్‌ను అభివృద్ది చేస్తానని ఆ డివిజన్ భాజపా అభ్యర్థి ఆకుల శ్రీవాణి అన్నారు. ప్రధాన సమస్యలను పరిష్కరించడంంతో పాటు... అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తమ డివిజన్‌లో మహిళలు ఇబ్బందులు తొలగించడానికి మోదీ విజన్‌లో భాగంగా ప్రవేశపెట్టిన సఖీ బృందం ద్వారా మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని అన్నారు.
'అన్ని సమస్యలు పరిష్కరిస్తా... మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు' - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం
సరూర్‌నగర్ డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని భాజపా అభ్యర్థి ఆకుల శ్రీవాణి హామీ ఇచ్చారు. ప్రధాని ప్రవేశ పెట్టిన మోదీ విజన్‌తో సఖీ బృందం ద్వారా మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని అన్నారు. తనను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
'అన్ని సమస్యలు పరిష్కరిస్తా... మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు'
డివిజన్‌లో ఆట స్థలం, రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తానని ఆకుల శ్రీవాణి తెలిపారు. సరూర్‌నగర్ ప్రజలు తనను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Nov 21, 2020, 8:04 PM IST