మనకు సపోటా చెట్లు తెలుసుగానీ.. భారీ వృక్షాలు అరుదు. ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటసాలలో సపోటా భారీ వృక్షంలా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించింది. గ్రామంలోని వేమూరి కుటుంబం అయిదు తరాలుగా ఈ చెట్టును సంరక్షిస్తోంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ చెట్టు భారీ తుపాన్లను సైతం తట్టుకొని నిలిచింది.
సెంటున్నర పెట్టు.. ఈ సపోటా చెట్టు - Krishna district latest news
కృష్ణా జిల్లా ఘంటసాలలో సపోటా చెట్టు భారీ వృక్షంలా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించింది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ చెట్టు భారీ తుపాన్లను సైతం తట్టుకొని నిలిచింది.
సెంటున్నర పెట్టు.. ఈ సపోటా చెట్టు
గ్రామానికి చెందిన బాబూ రాజేంద్రప్రసాద్ ముత్తాత వేమూరి వెంకట్రామయ్య- సుబ్బమ్మ దంపతులు బ్రిటిష్ కాలంలో తమ ఇంటి పెరట్లో మొక్కను నాటారు. అప్పటినుంచి తరాలుగా వారి కుటుంబం దీన్ని సంరక్షిస్తోంది. ఇంటి ఆవరణలో సెంటున్నర స్థలం ఆక్రమించినప్పటికీ పచ్చదనం కోసం రక్షిస్తున్నామని బాబూ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:వివాహిత అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యే అంటున్న భర్త