Sant Ravidas Birth Anniversary : దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని... సీఎం కేసీఆర్ మోసం చేశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌తోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.... సంత్ రవిదాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అంబేడ్కర్ భావజాలాన్ని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా తీసుకు వెళ్తున్నారని... ప్రాంతీయ పార్టీలు కుటుంబ, స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని లక్ష్మణ్ దుయ్యబట్టారు. రిజర్వేషన్‌లను అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందన్నారు.
Sant Ravidas Birth Anniversary : 'సీఎం కేసీఆర్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది' - సీఎం కేసీఆర్పై కె లక్ష్మణ్ విమర్శలు
Sant Ravidas Birth Anniversary : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మార్చాల్సిన సమయం అసన్నమైందని... భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అందుకోసం దళిత సమాజమంతా ఏకం కావాలని పేర్కొన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
![Sant Ravidas Birth Anniversary : 'సీఎం కేసీఆర్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది' K Laxman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14484661-292-14484661-1645013154920.jpg)
K Laxman
కేసీఆర్‌కు దళితుల పట్ల ప్రేమ ఉంటే మంత్రివర్గంలో ఎస్సీలను ఎక్కువ మందిని ఎందుకు తీసుకోలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అబద్ధాలు, ప్రజా వ్యతిరేకులకు కర్రకాల్చి వాత పెట్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జి మునుస్వామి, మనోహర్ రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :EC notice to Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు.. 24 గంటల్లో..