Sankranti Rush in Telangana 2024: సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులంతా సెలవులు ముగియడంతో తిరిగి పట్టణం వైపు ప్రయాణమయ్యారు. తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మంగళవారం నుంచే తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా నగరానికి వస్తున్న ప్రయాణికులతో ఊర్లలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
Sankranti Return journey Huge Rush Telangana : మరోవైపు ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద హైదరాబాద్ వైపుగా వేలాది వాహనాలు వస్తున్నాయి. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఉండడంతో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా టోల్ గేట్ దాటి వెళ్తున్నాయి.
సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి చౌటుప్పల్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు జామ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రాపిక్ పోలీసులు ముందస్తుగా ఊర్ల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ జామ్ కాకుండా సజావుగా సాగుతుంది.
టోల్గేట్ ఛార్జీలు, ట్రాఫిక్ తప్పించుకోవాలా? సంక్రాంతి రిటర్న్ జర్నీలో ఇలా చేయండి
రాష్ట్రంలో పాఠశాలలు 18 నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లినవారిలో అత్యధికులు ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లినవారి రద్దీ బుధవారం నుంచి ఎక్కువగా ఉండనుంది. ఖమ్మం, భద్రాచలం, కోదాడల నుంచి వచ్చే బస్సుల్లో బుధవారం దాదాపు రిజర్వేషన్లన్నీ పూర్తయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, విజయవాడ, నెల్లూరుల నుంచి 17న వచ్చే బస్సుల్లో సీట్లు లేవు. 18న కూడా భారీగా ప్రయాణాలున్నాయి.