తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగ తెచ్చిన రద్దీ - కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు - సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ

Sankranti Rush In Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి షురూ అయింది. పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్​స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అందుకు అనుగుణంగా అధికారులు సర్వీసులు నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Sankranti Rush Leads to Traffic Jam
Sankranti Rush In Telangana 2024

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 7:53 AM IST

పండుగ సందర్బంగా కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Sankranti Rush In Telangana 2024 : సంక్రాంతి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అందుకు అనుగుణంగా అధికారులు సర్వీసులు నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒక్కసారిగా ప్రజలు రొడ్డెక్కడంతో రహదారులు రద్దీగా మారిపోయి. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సంక్రాంతి ఎఫెక్ట్ - పంతంగి టోల్​ప్లాజా వద్ద వాహనాల రద్దీ

Sankranti Rush Leads to Traffic Jam: సంక్రాంతిపండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 120కి పైగా ప్రత్యేక రైళ్ళను నడిపిస్తోంది. వీటితో పాటు సాధారణ రైళ్లు సుమారు 400 వరకు నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. ప్రయాణికులు వాళ్ల రైలు వచ్చే సమయం కన్నా మూడు గంటలకు ముందే స్టేషన్లకు చేరుకుంటున్నారు. దీంతో రద్దీ భారీగా పెరిపోతుంది. విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ వైపుకు వెళ్లే రైళ్లు రద్దీగా కనిపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు సైతం సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు.

ఊరెళ్తున్న భాగ్యనగరం - ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు

TSRTC Special Buses for Sankranti 2024: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ4,484 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్ బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

Sankranti Festival Effect: హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్‌స్టేషన్‌లోని కంట్రోల్‌ రూమ్‌లకు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?

సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా సర్కార్ ప్లాన్ - ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్​

ABOUT THE AUTHOR

...view details