తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఇళ్లు జాగ్రత్త ! - హైదరాబాద్​ ఈరోజు వార్తలు

సంక్రాంతికి ఊరెళ్తున్నారా అయితే జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతేడాది కమిషనరేట్ల పరిధిలో జరిగిన చోరీలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళితే ఇదే అదనుగా దొంగలు ప్రతి ఏడాది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

sankranti dongalu at festival time in telangana
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఇళ్లు జాగ్రత్త !

By

Published : Jan 14, 2020, 6:17 AM IST

Updated : Jan 14, 2020, 8:00 AM IST

హైదరాబాద్‌ పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు సవాళ్లు విసురుతున్నాయి. గతేడాది సంక్రాతి పండుగను టార్గెట్​ చేసుకొని పదుల సంఖ్యలో ఇళ్లల్లో చోరీలు చేశారు. ఈ ఏడాది ఎక్కడ చోరీలు, దోపిడీలు జరగకుండా పోలీసులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి వరుస సెలవులు ఉన్నందున దొంగల ముఠాలు ఇప్పటికే సిటీలో రెక్కీ నిర్వహించాయని, మొన్న దొరికిన కరుడుగట్టిన చెడ్డి గ్యాంగ్ అరెస్ట్ తర్వాత పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కార్డెన్​ సెర్చ్​లు నిర్వహిస్తున్నారు.

పగలు రాత్రి అని తేడా లేకుండా
ముఖ్యంగా శివారు ప్రాంతాలనే అడ్డాలుగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతి సీజన్​ మంచి సమయంగా ఎంచుకుని కాలనీల్లో ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయి. తాళాలు ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పగలు రాత్రి అని తేడా లేకుండా చోరీలు చేస్తారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలు, పోలీసుల నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఇళ్లనే తమ చోరీలకు అనువైన ప్రాంతాలుగా ఎంచుకుంటారు. అయితే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదా పోలీస్​స్టేషన్​లో సమాచారం ఇచ్చి వెళితే ఆ ఇంటిపై నిఘా ఉంచుతామంటున్నారు.

గతంలో చోటు చేసుకున్న ఘటనలపై
మరోవైపు ఈ పండుగ సమయంలో దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేసి ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి చోరీల నియంత్రణకు ప్రణాళిక రూపొందించారు. తాము ఎంత రెక్కీ నిర్వహించినా సొంత ఊళ్లకు వేళ్లే వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో
ఇళ్ల దొంగతనాలతో పాటు ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలు కూడా చోరీకి గురవుతాయి. అయితే కొంత మంది ఇళ్లు చోరీ అవుతుందేమో అన్న భయంతో విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కార్లలో పెడతారు. ఇలా చేయోద్దని పోలీసులు సూచించారు. ప్రయాణ సమయాల్లో బ్యాగుల్లో బంగారు నగలు, డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై డయల్‌ 100, సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ క్రైమ్​ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

ప్రజల అప్రమత్తంగా ఉండి సహకరిస్తే సంక్రాంతి సెలవుల్లో చోరీలను పూర్తి స్థాయిలో అరికడతామని రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఇళ్లు జాగ్రత్త !

ఇదీ చూడండి : ఒకే వేదికపై పతంగులు, మిఠాయిలు స్నాక్స్​ ప్రారంభం

Last Updated : Jan 14, 2020, 8:00 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details