Sankranti Celebrations 2022: హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో భోగి, సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్ద అందరూ కలిసి ఆనందంగా గడుపుతున్నారు. సంక్రాంతి సెలవులు రాగానే అవకాశం ఉన్నవారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. అవకాశం లేనివారు సంక్రాంతి పండుగని ఇక్కడే జరుపుకుంటున్నారు. అటువంటి వాళ్లకు పల్లె అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది శిల్పారామం. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఎటుచూసిన మనసుకు ఉల్లాసాన్ని కల్గించే పచ్చని చెట్లు, బోటు శికారు ఇలాంటివన్నీ ఇక్కడ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలు నేటితరం పిల్లలకు తెలియవు అని.. వాటిని తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు సందర్శకులు చెబుతున్నారు. పల్లె వాతావరణం ఎలా ఉంటుంది.. అక్కడ ఏమి వృత్తుల చేసే వారు ఉంటారు అనే విషయాలు పిల్లలకు వివరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇక్కడ తమ చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటాయో.. అలాగే ఇక్కడ ఏర్పాటు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెటూరి వాతావరణం
పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది ఈ శిల్పారామం. సొంతూరు వెళ్లడానికి కుదరక ఇక్కడే ఉన్నాం. ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చాం. -సందర్శకుడు
అదే ఉద్దేశంతో..
అందరూ పండగలకు ఊరెళ్తూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఊరు వెళ్లలేదు. అందుకే పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇలాంటి చెట్లు, వాతావరణం పల్లెటూళ్లలో చూస్తూ ఉంటాం. అవి అన్నీ పిల్లలకు తెలియవు. ఇవన్నీ వారికి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాం. -సందర్శకురాలు
నేటితరం పిల్లలకు తెలియజేయాలనే..