తెలంగాణ

telangana

ETV Bharat / state

Vijayawada Durga Temple: బెజవాడ దుర్గమ్మ గుడిలో బొమ్మల కొలువు.. చూసొద్దామా!! - సంక్రాంతి పండుగ వార్తలు

Vijayawada Durga Temple: సంక్రాంతి అంటేనే.. సంతోషాల సంబరం. రకరకాల వేడుకలతో పండుగను జరుపుకొంటారు తెలుగువారు. వాటిలో బొమ్మల కొలువు ఒకటి. పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అద్భుతంగా అమర్చి... ఇతిహాస విశేషాలను భవిష్యత్‌ తరానికి తెలియజేయాలనే సంకల్పమే... దీని వెనక ఉన్న ఆంతర్యం.

Vijayawada Durga Temple
దుర్గగుడిలో బొమ్మల కొలువు

By

Published : Jan 15, 2022, 9:40 AM IST

దుర్గగుడిలో బొమ్మల కొలువు

Vijayawada Durga Temple: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంతోపాటు ఇతర ఆలయాలు, ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల దసరా తొమ్మిది రోజులు బొమ్మలకొలువులు పెట్టడం ఆనవాయితీగా ఉంటే... మరికొన్ని చోట్ల సంక్రాంతి మూడ్రోజులు కొలువులు పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి ఆడపిల్లలతో... మెట్లు మెట్లుగా అమరుస్తారు. ఇవి ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉంటాయి.

ఈ బొమ్మల కొలువును దుర్గగుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు దంపతులు, ఈవో భ్రమరాంబ ప్రారంభించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారంతా బొమ్మల కొలువులను వీక్షించి.. పాతజ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విజయవాడతోపాటు నగర శివారులోని గ్రామాల్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి.. బంధు మిత్రులను పేరంటానికి పిలుస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. బొమ్మల కొలువు కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా.. సంస్కృత సంపన్నమై.. సంప్రదాయ పరిరక్షణతో పాటుగా కళాత్మక దృష్టినీ పెంపొదిస్తుంది.

ఇదీ చదవండి:Sankranti Celebrations 2022: తెలుగు లోగిళ్లలో.. ఘనంగా సంక్రాంతి సంబరాలు..

ABOUT THE AUTHOR

...view details