తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకరనారాయణ - మంత్రి శంకరనారాయణ

ఏపీ రహదారులు, భవనాల శాఖ మంత్రిగా శంకరనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు.

sankar
రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకరనారాయణ

By

Published : Jul 29, 2020, 2:36 PM IST

ఆంధ్రప్రదేశ్​ రహదారులు, భవనాల శాఖ మంత్రిగా శంకరనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు.

కొత్త మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్​లు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వారికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మంత్రి శంకరనారాయణ శాఖను మార్చింది. చెల్లుబోయిన వేణుగోపాల్​కు బీసీ సంక్షేమశాఖను కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖలు అప్పగించారు. ఇక బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణకు రహదారులు, భవనాల శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు రహదారులు, భవనాల శాఖ బాధ్యతలు చూసిన ధర్మాన కృష్ణదాస్​కు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి.... ఆయనకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను అప్పగించారు.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details