తల్లిపాలు అమృతం కన్నా విలువైనవని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా... రెయిన్ బో ఆసుపత్రి ఏర్పాటు చేసిన మధర్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. తాను తల్లయ్యాకే తల్లిపాల గొప్పతనాన్ని తెలుసుకున్నానని సానియా అన్నారు. తమ పిల్లలకు ఇచ్చిన తర్వాత అదనంగా ఉన్న పాలను ఈ మిల్క్ బ్యాంక్‌కి అందించటం వల్ల తల్లిపాలు అందుబాటులో లేని చిన్నారులకు ఉపయోగపడతాయన్నారు.
తల్లిపాలు అమృతం... కాపాడుకోవడం మన కర్తవ్యం - తల్లిపాలు అమృతం...
తల్లిపాల ప్రాధాన్యాన్ని తెలుపుతూ... రెయిన్ బో ఆసుపత్రి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మధర్ మిల్క్ బ్యాంక్ పేరుతో తల్లిపాలు భద్రపరిచే సౌకర్యాన్ని కల్పించింది.
![తల్లిపాలు అమృతం... కాపాడుకోవడం మన కర్తవ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4072083-thumbnail-3x2-sania.jpg)
తల్లిపాలు అమృతం... కాపాడుకోవడం మన కర్తవ్యం
Last Updated : Aug 8, 2019, 7:41 PM IST