విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్పోర్ట్స్ లీగ్‌లు ఎంతగానో దోహదపడతాయన్నారు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ ఇంటర్ సొసైటీ లీగ్ స్పోర్ట్స్ మీట్- 2020 ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్, తెలంగాణ సోషల్ వెల్ ఫెయిర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీస్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.