హైదరాబాద్లోని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సిబ్బంది శానిటైజేషన్ చేశారు. రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరిగిపోతుండడం, కార్యాలయంలో ఇద్దరు సిబ్బంది మహమ్మారి బారిన పడడంతో ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయం అంతటా హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో శానిటైజేషన్
భాజపా రాష్ట్ర కార్యాలయంలో సిబ్బంది శానిటైజేషన్ చేశారు. పుర పాలికలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశామని పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో శానిటైజేషన్
రాష్ట్రంలోని 5 పుర పాలికలు, రెండు కార్పొరేషన్లకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదారాబాద్లోని లింగోజీగూడ మున్సిపాలిటీలో కూడా ఎలక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉండడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజేషన్ చేశామని సింబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి:పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు