చైనాలో మాదిరిగా హైదరాబాద్ నగరంలో నిండుగా మెడికో యునిఫామ్‌ను ధరించి కరోనా వ్యాధి విస్తరించకుండా స్ప్రే చల్లడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. కరోనా మహమ్మరిని అరికట్టడానికి జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లు, బస్ స్టాపులు, మాల్స్, జన సమూహ ప్రాంతాలు, సినిమా థియేటర్ల సమీప ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ఫుట్పాత్లు, చెత్తగా కనిపించే అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు.
కరోనా కట్టడికి హైదరాబాద్ నగరంలో శానిటైజేషన్ - CORONA PRECAUTIONS IN HYDERABAD
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒంటి నిండా మెడికో యునిఫామ్ ధరించి స్ప్రే చేస్తూ... కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు.

కరోనా కట్టడికి హైదరాబాద్ నగరంలో శానిటైజేషన్
హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని లిబర్టీ రోడ్డు, హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో స్ప్రే చేస్తున్నారు. ప్రతి జోన్కు ఐదుగురు సిబ్బంది చొప్పున 24 గంటల పాటు పదిహేను మంది కరోనాను అరికట్టడానికి స్ప్రే చేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు.
కరోనా కట్టడికి హైదరాబాద్ నగరంలో శానిటైజేషన్
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత