ప్రగతి భవన్ వద్ద పారిశుద్ధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం - hyderabad latest news
17:50 July 24
ప్రగతి భవన్ వద్ద పారిశుద్ధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ కూకట్పల్లి సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే నందిని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
విధులు నిర్వహిస్తున్న సమయంలో పై అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నందిని ఆరోపించింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం జరగకపోవడం వల్లే చనిపోవాలని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు.