తెరాస ప్రభుత్వం.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. తెరాస 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మాజీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ - former Deputy Mayor of ghmc
తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించారు.
![మాజీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ sanitation in borabanda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-img-20210428-wa0057-2804newsroom-1619621675-795.jpg)
sanitation in borabanda
బోరబండ, మోతీనగర్‌లోని పలు రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు ఫసియుద్దీన్. ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'మినీ పోల్స్‌కు కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీ ఏర్పాట్లు'