తెలంగాణ

telangana

ETV Bharat / state

మెప్పిస్తున్న సంగీత, నృత్య కళాకారుల ప్రదర్శనలు - ravindra bharathi

రవీంద్రభారతిలో రెండురోజులుగా నిర్వహిస్తున్న సంగీత, నృత్యోత్సవం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనలతో మెప్పిస్తున్నారు.

sangeetha nrutyostavam 2 day in ravindra bharathi
మెప్పిస్తున్న సంగీత, నృత్య కళాకారుల ప్రదర్శనలు

By

Published : Jan 31, 2020, 9:31 AM IST

తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రధాన మందిరంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సంగీత, నృత్యోత్సవం భక్తిరసం పంచుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సంగీత, నృత్య కళాబృందాలు తమ ప్రదర్శనలతో మెప్పిస్తున్నారు.

ఔత్సాహిక, ప్రముఖ కళాకారులు సంకీర్తన గాత్రాలు, వాయిద్య సంగీతాలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో చూపరులను, సంగీత ప్రియులను అలరించారు. అనంతరం కళాకారులను బాద్మి శివకుమార్ సన్మానించారు.

మెప్పిస్తున్న సంగీత, నృత్య కళాకారుల ప్రదర్శనలు

ఇవీ చూడండి:అరసవల్లి సూర్యదేవాలయం.. స్వామివారి నిజరూప దర్శనం

ABOUT THE AUTHOR

...view details