తెలంగాణ

telangana

ETV Bharat / state

'అప్పుడు ప్రశ్నించారు.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు' - ఎంఐఎం నేతలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపాటు

సచివాలయంలో మసీదు కూల్చివేతపై ఎంఐఎం నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుపాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. అధికారంలో ఎవరుంటే వారిని పొగడ్తలతో ముంచడం మజ్లిస్ నేతలకు అలవాటని ఆయన ఆరోపించారు.

sangareddy-mla-jaggareddy-serious-on-mim-party
'అప్పుడు ప్రశ్నించారు.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు'

By

Published : Jul 26, 2020, 8:33 AM IST

మియపూర్ నుంచి పఠాన్ చెరు వరకు హైవే నిర్మాణంలో భాగంగా రహదారి కోసం మసీద్‌ గోడను కూడా కూల్చనివ్వకుండా అడ్డుకున్న మజ్లిస్‌ నేతలు... ఇప్పుడు సచివాలయంలో మసీదు కూల్చితే ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఎంఐఎం నేతలు మౌనం వీడి సమధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. అధికారంలో ఎవరుంటే వారిని పొగడ్తలతో ముంచెత్తడం ఎంఐఎం నేతలకు అలవాటని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డిలు ఇప్పుడు కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఆరోపించారు.

'అప్పుడు ప్రశ్నించారు.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు'

కరోనాతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయని... సచివాలయ నిర్మాణానికి ఖర్చు చేయనున్న రూ.500 కోట్లుతో వారిని కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన కోరారు. ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచేందుకే.. బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కడుతున్నారని ఆరోపించారు. భాజపా, ఎంఐఎంలు ఈ చర్యలకు మద్దతుగా నిలుస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి:నీటి పొదుపు, వృథాని అరికట్టేందుకు 'జలమండలి జలగీతం'

ABOUT THE AUTHOR

...view details