టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పోల్చితే... భాజపా ఎంపీ అరవింద్‌కు రాజకీయ అనుభవం చాలా తక్కువని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పరిశ్రమలను తాము వ్యతిరేకిస్తున్నామని భాజపా నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పరిశ్రమల స్థాపనకు అందరూ సహకరించాలని తెలిపారు.
ఎంపీ అరవింద్‌వి అనుభవం లేని మాటలు: జగ్గారెడ్డి - ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన జగ్గారెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై... భాజపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. పరిశ్రమల స్థాపనకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎంపీ అరవింద్‌వి అనుభవం లేని మాటలని విమర్శించారు.
ఎంపీ అరవింద్‌వి అనుభవం లేని మాటలు: జగ్గారెడ్డి
ఎంపీ అరవింద్‌కు రాజకీయ అనుభవం లేదన్న జగ్గారెడ్డి... భాజపా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. వైన్ షాపుల వద్ద గుమికూడి మద్యం కొనుగోలు చేస్తే రాని కరోనా... గుళ్లకు వెళ్లి పూజలు చేస్తే వస్తుందా అని ప్రశ్నించారు. నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లో పూజలకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు