తెలంగాణ

telangana

ETV Bharat / state

నేనేమీ తెరాస కోవర్టును కాను: జగ్గారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజా వార్తలు

సామాజిక మాధ్యమాల్లో కొందరు తనను తెరాస కోవర్టునని ప్రచారం చేస్తుండడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. తాను తెరాసకు కోవర్టుగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్​ అధిష్ఠానం అవకాశం ఇస్తే రాష్ట్రంలో అందరినీ సమన్వయ పరచుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.

mla jaggareddy pressmeet
'మీ పేరు, ఫోన్​ నంబర్​ చెప్పండి... నేనే మీ ఇంటికొచ్చి వివరణ ఇస్తా'

By

Published : Aug 10, 2020, 7:29 PM IST

తెరాస కోవర్టుగా సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. పీసీసీ అవకాశమిస్తే సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరిని సమన్వయం చేసుకుని పోతానని తెలిపారు.

కొందరు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలు చేయాలనుకునేవారు.. వారి పేరు, ఫోన్‌ నంబర్లు కూడా జత చేయాలని... అలా చేస్తే తానే స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లి వివరణ ఇస్తానని తెలిపారు.

నేనేమీ తెరాస కోవర్టును కాను: జగ్గారెడ్డి

ఇవీ చూడండి:బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details