అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే రైతుల ఆత్మహత్యలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రెండురోజుల్లో ఆరుగురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని విమర్శించారు.
రైతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: జగ్గారెడ్డి - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రభుత్వ ఆదేశాలతోనే రైతుల ఆత్మహత్యలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని హైదరాబాద్లోని గాంధీభవన్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రైతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి : జగ్గారెడ్డి
తెలంగాణ వస్తే రైతుల ఆత్మహత్యలుండవని వేల సభల్లో చెప్పిన కేసీఆర్... అందుకోసమే రికార్డుల్లో నమోదు చేయడం లేదని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రూ.500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు పరిహారం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రైతన్నలకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించకపోతే ప్రగతిభవన్ ముందు ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.