పార్టీ అధినేత సోనియా గాంధీ ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినా తామంతా కలిసే పనిచేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని... అనుమతి రాగానే దిల్లీ వెళ్తామని చెప్పుకొచ్చారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాతనే డబ్బు ప్రభావం రాజకీయాలలో ఎక్కువైందని ఆరోపించారు. తెరాస ఓటు, డబ్బు అన్న నినాదాన్ని తెచ్చిందని, సిద్దాంతాలను నమ్మే పార్టీ అని చెప్పుకునే భాజపా కూడా జీహెచ్ఎంసీలో డబ్బు రాజకీయం చేసిందని విమర్శించారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదని... అందుకే ఎన్నికల్లో ఓడిపోతున్నామన్నారు.