ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ధరణిపై ప్రజలకు పలు అనుమానాలున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ధరణి ఓ ప్రైవేటు యాప్ అని వెల్లడించారు. ప్రజలు తమ ఆస్తి వివరాలు దీనిలో నమోదు చేయాలని... ఇంత హడావిడిగా ప్రభుత్వం దీనిని తీసుకురావడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.
''ప్రైవేటు యాప్ను నమ్మి ప్రజలు ఎలా వారి ఆస్తి వివరాలు నమోదు చేస్తారు? వాటికి రక్షణ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తోందో కేసీఆర్ చెప్పాలి. ప్రజలకున్న అనుమానాలను నివృతి చేయాలి. ఏదైనా కొత్త చట్టం కానీ, విధానం కానీ ప్రవేశ పెడుతున్నప్పుడు కమిటీ వేసి.. అధ్యయనం చేయించాలి. ధరణి విషయంలో ఉన్నత స్థాయి అధికారులతో లేదా మంత్రులతో ఎందుకు కమిటీ వేయలేదు?''