ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వరుడి ఆలయ గోపురం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసంలోకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో నిర్మించనున్న రామాలయం కోసం సప్త నదుల జలాలు, మృత్తికను తీసుకుని... అయోధ్యకు పంపనున్నట్లు శర్మ తెలిపారు.
సంగమేశ్వరాలయం గోపురాన్ని చుట్టుముట్టిన కృష్ణమ్మ - శ్రీశైలం సంగమేశ్వర ఆలయం న్యూస్
శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. దీనితో శ్రీశైలం వెనుక జలాల్లో ఉన్న ప్రముఖ దేవాలయమైన సంగమేశ్వర ఆలయం పూర్తిగా మునిగిపోతోంది.
![సంగమేశ్వరాలయం గోపురాన్ని చుట్టుముట్టిన కృష్ణమ్మ sangameswaram-temple-in-water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8192224-846-8192224-1595850605348.jpg)
నీట మునుగనున్న సంగమేశ్వరాలయం