ఏపీ కర్నూలు జిల్లాలో.. ఎనిమిది నెలలుగా కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయిన సంగమేశ్వరుడు.. శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం తగ్గడంతో.. ఆలయ ప్రహరీ, ముఖ ద్వారం, ప్రాంగణంలోని దేవతామూర్తులు వెలుగుచూశాయి. శివలింగం.. ఇంకో అడుగుమేర నీటిలోనే ఉండిపోగా, మరికొద్ది రోజుల్లో పూర్తి దర్శన భాగ్యం లభించనుంది.
ఎనిమిది నెలల తరువాత సంగమేశ్వరుని దర్శనం - తెరుచుకున్న సంగమేశ్వర ఆలయం
ఏపీ శ్రీశైలం జలాశయం నీటిమట్టం పెరుగుదలతో కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరుడు ఎనిమిది నెలలుగా నీటిలోనే ఒదిగిపోయాడు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిపోవడంతో.. స్వామివారు మళ్లీ భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఎనిమిది నెలల తరువాత సంగమేశ్వరుని దర్శనం
గతేడాది జులై 19న నదిలో ఒదిగిపోయిన ఆలయం తిరిగి తెరుచుకోవడంతో.. భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. అర్చకులు ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరుపగా.. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి:వివాహ ముహూర్తాలకు మూఢాల అవరోధం