ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని.. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష మంది పాల ఉత్పతిదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.14 కోట్లు చెల్లించామని, 771 మంది పర్మినెంట్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు అందించామని చెప్పారు. 415 మంది ఒప్పంద ఉద్యోగులకు వారి ఏప్రిల్ నెల వేతనాలు అందిస్తామని అన్నారు.
యథావిధిగా సంగం డెయిరీ కార్యకలాపాలు - తెలంగాణ వార్తలు
గుంటూరు జిల్లా సంగం డెయిరీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. పాల ఉత్పతిదారులు, కాంట్రాక్టర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాల ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు, ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించామన్నారు.
సంగం డెయిరీ కార్యకలాపాలు, యథావిధిగా సంఘం డైరీ
సోమవారం 4.96 లక్షల లీటర్ల పాలు డైయిరీకి వచ్చాయని.. వాటిని ప్రాసెస్ చేసి యథావిధిగా మార్కెటింగ్ చేశామని అహ్మద్ బాబు తెలిపారు. సంగం డైయిరీ రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా జరుగుతున్నాయన్నారు. పాల ఉత్పతిదారులు, కాంట్రాక్టర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కరోనా మహమ్మారితో గుండెకు పెనుముప్పు