తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తాం' - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆయన... పారిశ్రామికవేత్తల సమస్యల విషయంలో స్పందించారు.

sandeep kumar sultania, Telangana Chambers of Commerce and Industry
'ఆ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తాం'

By

Published : Jun 16, 2021, 11:29 AM IST

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హామీ ఇచ్చారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వర్చువల్ ఓపెన్ హౌస్​ సమావేశంలో పారిశ్రామికవేత్తల సమస్యలపై ఆయన స్పందించారు. వర్చువల్ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, మరో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు, ఎఫ్‌టీసీసీఐ సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్​నగర్, మెదక్ జిల్లా పరిధిలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఆస్తి పన్ను, లే అవుట్, అనుమతుల వంటి ఇబ్బందుల పరిష్కారాలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్తి పన్నును హేతబద్దీకరించాలని పారిశ్రామికవేత్తలు అధికారులను కోరారు. పారిశ్రామికవేత్తలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని పంచాయతీరాజ్ అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి:ఆరు వేల సీసాలతో ఆశ్రమ భవనం

ABOUT THE AUTHOR

...view details