తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ పాలసీ వల్ల రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల ఈటీవీ భారత్‌తో అన్నారు. ఐటీ వికేంద్రీకరణ చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5.82 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని.. ఒక ఐటీ ఉద్యోగి వల్ల ముగ్గురికి ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయని సందీప్‌కుమార్ తెలిపారు.
'ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వల్లే ఐటీ అభివృద్ధి చెందింది' - తెలంగాణ ఐటీపై సందీప్‌కుమార్
తెలంగాణలో తెరాస ప్రభుత్వం వచ్చాక ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5.82 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన వెల్లడించారు.
'ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వల్లే ఐటీ అభివృద్ధి చెందింది'
గతంలో కొండాపూర్, మాదాపూర్‌లో మాత్రమే ఐటీ కంపెనీలు ఉండేవని.. ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్‌తో పాటు ఇతర నగరాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని సందీప్ అన్నారు. ఆ ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అదనపు ప్రోత్సహకాలు ఇస్తున్నందున ఐటీ రంగం విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండిః'కొత్త కంపెనీలకు తెలంగాణ సర్కార్ రాయితీలు ఇస్తోంది'