Sandalwood Trees Missing in Zoo Park Hyderabad :నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే చోటగుర్తు తెలియని వ్యక్తులు గంధపు చెట్లను నరికి, దుంగలుగా చేసి ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలాజికల్ పార్కులో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితంనెహ్రూ జూలాజికల్ పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు 7 గంధపు చెట్లను నరికివేసి ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దుంగలుగా చేసి అందులోని కొన్ని దుంగలు ఎత్తుకెళ్లిపోగా.. కొన్ని ఘటన స్థలం సమీపంలో దొరికాయి.
Seven Sandalwood Trees theft in Zoo Park : నెహ్రూ జూలాజికల్ పార్కులో వణ్య ప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జూ అధికారులు 7 గంధపు చెట్లను నరికినట్లు గుర్తించారు. అందులో కొన్ని దుంగలను మాత్రమే జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని జూ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జూ అధికారులు బహదూర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంధం చెట్లు దొంగతనాలకు గురవతున్న నేపథ్యంలో జూ పార్కులో పరిసరాలలో అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) లోకేశ్ జైస్వాల్ జూ అధికారులను ఆదేశించారు.