తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇసుక వివాదం.. డయాఫ్రం వాల్‌ పనులకు ఆటంకం - పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇసుక వివాదం న్యూస్

ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రాజెక్టు నిర్మాణానికి కావల్సిన ఇసుక ఇప్పుడు లభ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిర్మాణం కోసం తరలిస్తున్న ఇసుక రీచ్​లు తమవేని జేపీ వెంచర్స్ గుత్తేదారు మేఘ సంస్థ లారీలను ఆపేసింది.

Polavaram Sand
Polavaram Sand

By

Published : Mar 22, 2022, 9:59 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గుత్తేదారు మేఘ సంస్థ, జేపీ వెంచర్స్ మధ్య ఇసుక వివాదం నెలకొంది. పోలవరంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మేఘ సంస్థ ఇసుకను వాడుతుండగా..తవ్వకాలు జరుపుతున్న రీచ్‌లన్నీ తమవేనని జేపీ వెంచర్స్‌ అంటోంది.

ఈ మేరకు పోలవరానికి ఇసుక రవాణాను జేపీ వెంచర్స్ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి సుమారు 250 టిప్పర్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు అధికారులను సైతం జేపీ సంస్థ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా.. డయాఫ్రం వాల్‌లో కోటి క్యూబిక్ మీటర్లు అవసరమని మేఘ సంస్థ అంటోంది. ఇసుక వివాదం వల్ల పోలవరం డయాఫ్రం వాల్‌ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా..పోలవరం పనులకు ఎలాంటి ఆటంకాలు లేవని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి : తిరుపతి కలెక్టరేట్‌కు పద్మావతి నిలయం అప్పగింతపై హైకోర్టు స్టే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details