ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిలో ఎడ్లబండ్లపై ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ఒక్కో ఎడ్లబండికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పలుకుతుండటం, వారు ఇంటివద్దకే తెస్తుండటంతో... నగరవాసులు తమ అవసరాలకు వీరి ద్వారా ఇసుక తెప్పించుకుంటున్నారు. నదీ తీరంలో పీకల్లోతు నీళ్లల్లో దిగి ప్రమాదకర స్థితిలో ఇసుకను తోడుతున్నారు.
బతుకుపోరాటం: ప్రాణాలను పణంగా పెట్టి ఇసుక తోడుతున్నారు - కర్నూలులో తుంగభద్ర నది వార్తలు
ఇసుక తరలించేందుకు వారు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పీకల్లోతు నదీ నీళ్లలో దిగి ఇసుకను ఎడ్ల బండ్లతో తరలిస్తున్నారు. ఏపీలోని కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిలో కనిపిస్తున్న దృశ్యమిది..
కర్నూలు, తుంగభద్రి నదిలో ఇసుక తీత