జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస చేసిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధే తెరాస అభ్యర్థులను గెలిపిస్తుంది: మంత్రి తలసాని
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో పోటీ చేస్తోన్న అభ్యర్థులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులే విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధే తెరాస అభ్యర్థులను గెలిపిస్తుంది: మంత్రి తలసాని
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లకు తెరాస తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అభ్యర్థులకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. కచ్చితంగా తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల రెండో జాబితా విడుదల