లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు పూజారులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ చేయూత అందించింది. సికింద్రాబాద్ అల్వాల్‌లోని బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సభ్యురాలు జ్యోతి ఆధ్వర్యంలో దాదాపు 50 మంది పేద బ్రాహ్మణులకు ఉచితంగా నిత్యవసర సరకులను అందజేశారు.
పేద బ్రాహ్మణులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ నిత్యావసరాల అందజేత - Sanecessities to poor Brahmins
లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పూజారులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ అండగా నిలిచింది. 50 మంది పేద బ్రాహ్మణులకు ఉచితంగా నిత్యవసర సరకులను అందజేశారు.
![పేద బ్రాహ్మణులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ నిత్యావసరాల అందజేత Sanathana enter premium necessities to poor Brahmins](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-06-09-10h34m43s723-0906newsroom-1623215119-236.jpg)
Sanathana enter premium necessities to poor Brahmins
బొల్లారంలోని సాయిబాబా దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా పూజలు అర్చనలు, లేక దేవాలయాలు వెలవెలబోయిన పరిస్థితి నెలకొందని వారు అన్నారు. పేద బ్రాహ్మణులు ఆకలితో అలమటించ వద్దనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా, సుజాత, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దారుణం: ఆసుపత్రి ఆరుబయటే మహిళ ప్రసవం