శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అమ్మోనియం లోడుతో ఉన్న డీసీఎం వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 టన్నుల అమ్మోనియం లోడుతో భువనగిరి నుంచి మదనపల్లికి వెళ్తుండగా ఔటర్ రింగు రోడ్డుపై తనిఖీ చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. భువనగిరిలోని రాజశ్రీ ఎంటర్ప్రైజెస్ నుంచి 200 బ్యాగులు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని శంషాబాద్ సీఐ రామకృష్ణ తెలిపారు. నిందితులు రాజ్‌కుమార్, రవీంద్రపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అమ్మోనియం వాహనం సీజ్.. నిందితుల అరెస్ట్ - అమ్మోనియం అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్
అమ్మోనియాన్ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.
![అమ్మోనియం వాహనం సీజ్.. నిందితుల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4273144-thumbnail-3x2-dcmgupta1.jpg)
డీసీఎం సీజ్
అమ్మోనియం అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్
ఇదీ చూడండి : మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి