కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండున్నర నెలల లాక్డౌన్ కాలంలో చాలా మంది రాచకొండ పోలీస్ కమిషనరేట్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సాయం చేసిన వ్యక్తులను, సంస్థలను సమరిటన్ అవార్డులతో సత్కరించారు. నిరుపేదలను ఆదుకుని పోలీసుల ఆరోగ్యం కోసం తమకు మాస్కులు, పీపీఈ కిట్లు అందజేసిన వారి ఔదార్యాన్ని సీపీ ప్రశంసించారు.
ఆకలి తీర్చిన వారికి సమరిటన్ అవార్డులతో సత్కారం - రాచకొండలో సమరిటన్ అవార్డుల పురస్కారం
లాక్డౌన్లో రాచకొండ పోలీస్‌శాఖతో కలిసి... ఎంతో మంది ఆకలి తీర్చిన వారిని కమిషనర్ మహేశ్ భగవత్ సమరిటన్ అవార్డులతో సత్కరించారు. విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి... తమకు తోచిన సహాయం చేసినందుకు వారందరిని మహేశ్ భగవత్ ప్రశంసించారు.
ఆకలి తీర్చిన వారికి సమరిటన్ అవార్డులతో సత్కారం
ముఖానికి మాస్కలు ధరించి.. తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా కొవిడ్‌ను నియంత్రించవచ్చని సీపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్ వ్యాప్తి నుంచి తమను తాము రక్షించుకోవాలని కోరారు. సమాజానికి తమకు తోచిన సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పోలీసుశాఖకు దాతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'