రాజకీయ నాయకులు స్వలాభం కోసం ప్రలోభాలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రముఖ ఇంద్రజాలకుడు సామల వేణు ఆరోపించారు. 30 దేశాల్లో 7వేల ప్రదర్శనిలిచ్చి సమాజంలో మార్పునకు తనవంతు కృషి చేశానని తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణు.. ఎమ్మెల్సీగా ఎన్నికైతే సమాజంలో మరింత మార్పు తీసుకురాగలనని చెబుతున్నారు.
రాజకీయ నేతలు వ్యాపారులుగా మారుతున్నారు : సామల వేణు - samala venu controversial statements
సమాజ సేవ చేయాల్సిన రాజకీయ నేతలు వ్యాపారులుగా మారుతున్నారని ప్రముఖ ఇంద్రజాలకుడు సామలవేణు ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
![రాజకీయ నేతలు వ్యాపారులుగా మారుతున్నారు : సామల వేణు samala venu controversial statements on telangana politicians](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10361481-891-10361481-1611479325571.jpg)
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సామలవేణు
సమాజ సేవ చేయాల్సిన రాజకీయ నేతలు వ్యాపారులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తూ గెలుపొందడం తనకు ఆనవాయితీగా వస్తోందని, పట్టభద్రులంతా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని వేణు విజ్ఞప్తి చేశారు.