టీఎన్జీవో హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షునిగా సల్వది శ్రీరామ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ పాల్గొని.. నూతనంగా ఎన్నికైన శ్రీరామ్‌ను సన్మానించారు.
టీఎన్జీవో హైదరాబాద్ నగర అధ్యక్షునిగా శ్రీరామ్ - టీఎన్జీవో తాజా వార్తలు
నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షునిగా సల్వది శ్రీరామ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
![టీఎన్జీవో హైదరాబాద్ నగర అధ్యక్షునిగా శ్రీరామ్ Salvadi Shriram takes over as the new President of TNGO](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9065348-565-9065348-1601951671521.jpg)
గతంలో హైదరాబాద్ నగర శాఖలో అధ్యక్షునిగా పనిచేసిన రాయకంటి ప్రతాప్.. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులుకాగా ఏర్పడినా ఖాళీలో నూతన అధ్యక్షుడిగా సల్వది శ్రీరామ్‌ను కేంద్ర సంఘం ఏకగ్రీవంగా ప్రకటించింది.
అదేవిధంగా మిగితా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఖాళీగా ఉన్నా పదవులను నియమించారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌లు తనపై నమ్మకం కట్టబెట్టిన ఈ పదవీని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు... ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పాటుపడుతానని నూతన అధ్యక్షుడు శ్రీరామ్ స్పష్టం చేశారు.