Salu Dora Selavu Dora Digital Board: హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సాలు దొర.. సెలవు దొర డిజిటల్ బోర్డు తాజాగా మళ్లీ ప్రత్యక్షమైంది. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ.. భాజపా గతంలో కౌంట్‌డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ బోర్డుపై రాజకీయ దుమారం రేగింది. జీహెచ్ఎంసీ సైతం బోర్డు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు తొలగించమని చెప్పడంతో.. భాజపా నేతలు కార్యాలయం వద్ద బోర్డును తొలగించారు.
మళ్లీ ప్రత్యక్షమైన 'సాలు దొర.. సెలవు దొర' బోర్డు - సాలు దొర సెలవు దొర డిజిటల్ బోర్డు
Salu Dora Selavu Dora Digital Board: కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద 'సాలు దొర సెలవు దొర' డిజిటల్ బోర్డును తాజాగా మళ్లీ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ బొమ్మ లేకుండా కల్వకుంట్ల కౌంట్‌డౌన్ పేరుతో బోర్డు పెట్టారు. కేసీఆర్ గద్దె దిగే వరకు ఈ కౌంట్ డౌన్ బోర్డు కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.
Digital Board
తాజాగా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న భాజపా రాష్ట్ర నాయకత్వం.. మళ్లీ పార్టీ కార్యాలయం అవరణలో 'సాలు దొర సెలవు దొర' డిజిటల్ బోర్డును ప్రారంభించింది. సీఎం కేసీఆర్ గద్దె దిగే వరకు ఈ కౌంట్ డౌన్ బోర్డు కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 20, 2022, 1:06 PM IST