తెలంగాణ

telangana

ETV Bharat / state

108 డ్రైవర్లకు శుభవార్త... జీతాలు భారీగా పెంపు - ఏపీలో 108 సిబ్బందికి జీతాలు పెంపు

108 అంబులెన్సుల్లో పని చేసే సిబ్బందికి ఏపీ ప్రభుత్వం తీపికబురు తెలిపింది. వారికి జీతాలు భారీగా పెంచుతూ ఆ రాష్ట్ర సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

salary hiked for 108 employees in ap
108 డ్రైవర్లకు శుభవార్త... జీతాలు భారీగా పెంపు

By

Published : Jul 1, 2020, 2:26 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 సిబ్బందికి భారీగా జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 108 డ్రైవర్లకు 10 వేల రూపాయలు మాత్రమే జీతం వస్తోందన్న సీఎం... అనుభవాన్ని బట్టి వారికి 18 - 28 వేల రూపాయల వరకు ఇస్తామని వెల్లడించారు. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్​కూ అనుభవాన్ని బట్టి 20- 30 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

క్యాన్సర్ విభాగం ప్రారంభం

గుంటూరు సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)‌లో అధునాత క్యాన్సర్‌ విభాగాన్ని ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ ద్వారా ప్రారంభించారు. నాట్కో ట్రస్టు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో 50 కోట్ల రూపాయలతో ఆస్పత్రిని నిర్మించినట్లు సీఎం తెలిపారు. ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్న సీఎం... నాడు- నేడులో భాగంగా జాతీయ ప్రమాణాలు ఉండేలా మార్పులు తీసుకొస్తున్నామన్నారు. విలేజ్‌ క్లినిక్‌, పీహెచ్‌సీలను అనుసంధానం చేస్తామన్నారు.

108 డ్రైవర్లకు శుభవార్త... జీతాలు భారీగా పెంపు

ఇవీ చూడండి:బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details