మహిళా ఉద్యోగుల కోసం రూపొందించిన సేఫ్ ( సేఫ్టీ అవేర్నెస్ ఫర్ న్యూ హైర్ ఎంప్లాయిస్ ) యాప్ను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. మహిళల రక్షణకు యాప్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని.. కొవిడ్ సమయంలో సైబర్ క్రైం, మహిళల వేధింపుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
కొత్తగా చేరే ఉద్యోగిణులకు...
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే మహిళా ఉద్యోగులకు ఈ సేఫ్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ వెల్లడించారు. (ఎస్సీఎస్సీ) సహకారంతో మహిళల కోసం ఇప్పటికే మార్గదర్శక్, సంఘమిత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం అనేక రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఈలెర్నిగ్ మాడ్యూల్ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం పనిచేస్తుందని సీపీ పేర్కొన్నారు.
జాగ్రత్తలు ఉంటాయి...