తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాకిచ్చిన మాటతప్పి సైరా ఎలా విడుదల చేస్తారు' - Narsimhareddy family members agitated against Saira film team

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో వ్యాపారం చేస్తున్న సినీ హీరో రామ్​ చరణ్ తమను మోసం చేశారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఆరోపించారు. సైరా నరసింహారెడ్డి పేరుతో చిత్రీకరించిన సినిమా కోసం తమ నుంచి సమాచారం తీసుకొని... ఇప్పుడు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

'మాకిచ్చిన మాటతప్పి సైరా ఎలా విడుదల చేస్తారు'

By

Published : Sep 24, 2019, 8:25 AM IST

హైదరాబాద్ హైదర్​గూడలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు, దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి సేవ సమితి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. చిరంజీవి, రామ్​ చరణ్ తమకిచ్చిన మాట తప్పారని... న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. బాధ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు సభ్యులు, చిత్ర కథానాయకుడు చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, నటుడు అమితాబ్ బచ్చన్, దర్శకుడు సురేందర్ రెడ్డిని చేర్చినట్లు తెలిపారు. తమకు ఇచ్చిన మాట తప్పి ఇప్పుడు సిటీ సివిల్ కోర్ట్ నుంచి నోటీసులు పంపించారని ఆరోపించారు. ఇప్పటికైనా నిర్మాత రామ్ చరణ్ , హీరో చిరంజీవి స్పందించి తమకు ఇచ్చిన హామీ మేరకు ఆదుకోవాలని కోరారు.

'మాకిచ్చిన మాటతప్పి సైరా ఎలా విడుదల చేస్తారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details