Sainma Restaurant bumper offer : హైదరాబాద్ కొంపల్లికి చెందిన సైన్మా రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో బిర్యానీ తీసుకెళ్తే ఓ లక్కీ విన్నర్ కారును గెలుచుకోవచ్చునని ప్రకటించింది. రెస్టారెంట్లో బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉందని మేనేజర్ అశోక్ తెలిపారు. ఉగాది కానుకగా ఈ సరికొత్త లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తమదైన స్టయిల్లో పబ్లిసిటీ..
గత మూడేళ్ల క్రితం సందీప్ రెడ్డి, అక్షయ్ రెడ్డి కలిసి... ఈ సైన్మా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌కు కొంపల్లి పరిసరాల్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పాత సినిమా పాటలు, పోస్టర్లు, పాత రేడియోలను అలంకరించి... కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి కారును బంపర్ ఆఫర్‌గా ప్రకటించి... తమదైన రీతిలో పబ్లిసిటీ చేస్తున్నారు.