తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తగా ఆలోచించే వారికే భవిష్యత్తులో అవకాశాలు: శైలజాకిరణ్​

కొత్తగా ఆలోచించే వారికే భవిష్యత్తులో అవకాశాలుంటాయని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్​వీఆర్​ జేసీ ఇంజినీరింగ్ కళాశాల 35వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరిధి దాటి ఆలోచించాలని సూచించారు.

sailaja kiran speak about students
కొత్తగా ఆలోచించే వారికే అవకాశాలు

By

Published : Feb 29, 2020, 5:51 PM IST

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత వేగంగా మారుతోందని... అందుకు తగ్గట్లుగానే విద్యార్థులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ సూచించారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్​వీఆర్​ జేసీ ఇంజినీరింగ్ కళాశాల 35వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఆలోచించే వారికి మాత్రమే భవిష్యత్తులో అవకాశాలు బాగుంటాయన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థుల పరిధి దాటి ఆలోచించాలని సూచించారు.

పరిశ్రమకు అవసరమైన అంశాలను గుర్తించాలని... సమస్యలు పరిష్కరించే నైపుణ్యం పెంచుకోవాలని శైలజాకిరణ్​ అన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వంటి కార్యక్రమాలు ఈ దిశగా ఉపయోగపడతాయన్నారు. నలుగురితో కలిసి సమష్టిగా ఆలోచించటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శైలజాకిరణ్​ ప్రోత్సాహకాలు అందజేశారు.

కొత్తగా ఆలోచించే వారికే అవకాశాలు

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details